మెథడ్ యాక్టింగ్ అంటే..

యాక్టింగ్ అంటే మనకు తెలుసు. జీవితంలో నటించని మనిషి లేడు. మరి మనం యాక్టర్స్ అవుతామా? కాము. ఎందుకంటే చూడడానికి ప్రేక్షకులు లేరు కనుక. 

ప్రేక్షకుల కోసం నటించేదే నటన. 

మెథడ్ యాక్టింగ్ అంటే ఒకానొక మెథడ్ ను వాడి నటించడం. 

ఏంటా మెథడ్? 

స్టాన్‌స్లవ్‌స్కీ అనే ఒక రష్యన్ నాటక దర్శకుడు ఒక మెథడ్ ను కనిపెట్టాడు (‍?‍)‍

If I were .. ఇదే ఆ మెథడ్. 

ఆ స్థానంలో నేనుంటే ఎలా ప్రవర్తిస్తాను .. ఇదే ఆ మెథడ్. 

ఒక ఉదాహరణ చూద్దాం.. 

ఒక హంతకుడు ఒక అందగత్తెను హత్య చేస్తున్నాడు. ఆ హంతకుడిని నేనైతే ఎలా ప్రవర్తిస్తాను అని అనుకుని అలా నటించడం మెథడ్ యాక్టింగ్ .

ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమిటంటే .. పాత్రలో ప్రవేశించడం కాదు, పాత్రలా ప్రవర్తించడం. 

ఈ మెథడ్ యాక్టింగ్ ను పాపులర్ చేసిన గొప్ప నటుల్లో ఎవరూ మరచిపోలేని పేరు‍ మార్లన్ బ్రాండో. 


- సాయికిరణ్ పామంజి , 28-12-2024

Comments